జనం న్యూస్ నవంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాయంపేట మండలంలోని పెద్దకోడపాక గ్రామానికి చెందిన మంద సురేష్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పుల్యాల రాజు నియమించారు.మంద సురేష్ గతంలో బూత్ అధ్యక్షుడిగా, మండల అధికారి ప్రతినిధిగా, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయనకు ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు.ఈ సందర్భంగా మంద సురేష్ మాట్లాడుతూ. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి , జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషీధర్ రెడ్డి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పుల్యాల రాజు విరిగి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.అలాగే తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఎస్సీ మోర్చా బలోపేతానికి, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.