ఆంధ్రప్రదేశ్

అనకాపల్లి జోనల్ లో వైసీపీకి చావు దెబ్బ-గవర కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరికృష్ణ

అనకాపల్లి జోనల్ లో వైసీపీకి చావు దెబ్బ-గవర కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరికృష్ణ

జనం న్యూస్ నవంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి ఆదివారం జరిగిన జీవీఎంసీ స్థానిక ఎన్నికల్లో భాగంగా నేడు విడుదల అయిన ఫలితాలలో కూటమి చావు దెబ్బ కొట్టింది. 6 డివిజన్లలో కూటమి అభ్యర్థుల విజయ కేతనం ఎగరవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరికృష్ణ మాట్లాడుతూ అనకాపల్లి లో శాసన సభ్యులు కొణతాల రామకృష్ణ ఆధ్వర్యం లో అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో సుమారు 1317 కోట్ల రూపాయలు పైగా అభివృద్ది చేశారని, అనకాపల్లి లో జనసేన పార్టీ 3 డివిజన్ లు , తెదేపా 2, భాజపా 1డివిజన్ ల లో పోటీ చేసి ఘన విజయం సాధించాయని, కూటమి నాయకులు ఎంపి సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, జన సేవ పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రాంకీ కలిసి కట్టు గా కస్తపడి గెలిపించి ప్రధాని మోదీ, సీఎం చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు బహుమతి గా ఇచ్చారని అన్నారు.. విజయం సాధించిన 107,108,109,110,111,112 కార్పొరేటర్ సభ్యులను అభినందించారు.

ఇ-పేపర్