జనం న్యూస్ నవంబర్ 5, (పరిగి నియోజకవర్గం ఇంచార్జ్ హనుమంత్ రెడ్డి ) వికారాబాదు జిల్లా, పూడూరు మండలం, గ్రామాల్లో మంచినీటి సమస్య రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో పాండు తెలిపారు గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవగాహన కోసం ముందు జాగ్రత్త గా బుధవారం పూడూరు మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు వివిధ శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో పాండు మాట్లాడుతూ భూగర్భ జలాలు అంతరించిపోకుండా గ్రామాలలో వి బి జి రామ్ జి గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇంకుడు గుంతలు వాలు కట్టలు వంటి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. పశువులకు తాగునీటి సమస్య రాకుండా నీళ్లతోట్టిలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ సుందర్, పంచాయతీరాజ్ ఎ ఇ మధుసూదన్, పలు గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.