ఆంధ్రప్రదేశ్

రైతులకు చేరువలో శాయంపేట లో ‘మన గ్రోమోర్’…ఒకే చోట నాణ్యమైన వ్యవసాయ సేవలు

రైతులకు చేరువలో శాయంపేట లో ‘మన గ్రోమోర్’…ఒకే చోట నాణ్యమైన వ్యవసాయ సేవలు

జనం న్యూస్ నవంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా ‘మన గ్రోమోర్’ షాపును ఏర్పాటు చేసినట్లు జోనల్ మార్కెటింగ్ మేనేజర్ ఎస్. తిరుపతిరావు తెలిపారు. మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మన గ్రోమోర్ షాపును ఏఓ మార్క ప్రియదర్శిని ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జోనల్ మార్కెటింగ్ మేనేజర్ ఎస్. తిరుపతిరావు మాట్లాడుతూ.. రైతులు సాగు సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించి, అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను ఒకే చోట అందించడమే మన గ్రోమోర్ ప్రధాన ఉద్దేశమన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు తదితర ఉత్పత్తులు రైతులకు సులభంగా అందుబాటులో ఉండటంతోపాటు, సాగుకు అవసరమైన సూచనలు, సలహాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. పంటల దిగుబడి పెంచుకునేందుకు రైతులు అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులకు నమ్మకమైన సేవలు అందించడంలో మన గ్రోమోర్ కీలకంగా నిలుస్తుందని తెలిపారు. మండలంలోని రైతులు ఈ కేంద్రాన్ని వినియోగించుకుని సాగులో మెరుగైన ఫలితాలు సాధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ నందిపాక పూజా, ఏరియా మేనేజర్ శరత్, మార్కెటింగ్ మేనేజర్ నాగరాజు, పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారే పల్లి రవీందర్ (బుజ్జన్న)శాయంపేట స్టోర్ సిబ్బంది ప్రవీణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్