ఆంధ్రప్రదేశ్

రామకృష్ణ వీధిలో శ్రీలక్ష్మి చిల్డ్రన్ అండ్ ఆంకాలజిస్ట్ క్లినిక్ ప్రారంభం.

రామకృష్ణ వీధిలో శ్రీలక్ష్మి చిల్డ్రన్ అండ్ ఆంకాలజిస్ట్ క్లినిక్ ప్రారంభం.

కాలనీవాసులకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలి: జనంపల్లి పురేందర్ రెడ్డి** జనం న్యూస్ నంబర్ 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ వీధి కాలనీలో శ్రీలక్ష్మి చిల్డ్రన్ అండ్ ఆంకాలజిస్ట్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఉదయం 10:30 గంటలకు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి, కార్యదర్శి రాంచందర్ రావు ముఖ్య అతిథులుగా హాజరై క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రమ్యవర్ధినిలను అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి, కార్యదర్శి రాంచందర్ రావు, కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రామకృష్ణ వీధి కాలనీవాసులకు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రమ్యవర్ధిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు, తగిన చికిత్స అందించాలని కోరారు. నూతనంగా ప్రారంభించిన క్లినిక్ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వైద్య సేవల ద్వారా ప్రజల మన్ననలు పొందాలని మనస్ఫూర్తిగా వైద్య దంపతులను ఆశీర్వదించారు. అదేవిధంగా ఈ క్లినిక్ ప్రారంభోత్సవానికి సహకరించి, కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న పి. సూర్యనారాయణకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు పి. సూర్యనారాయణ, రాజు, జి. ప్రసాద్, టైగర్ పురుషోత్తం, లక్ష్మీనారాయణ, మూర్తి, వెంకటేశ్వరరావు, జి. నర్సింగరావు, కిషోర్, భాస్కర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కాలనీలో వైద్య సేవలు అందుబాటులోకి రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

ఇ-పేపర్