సబ్ టైటిల్ : పూడిమడకలో ఓటరు స్లిప్పులు అందక అయోమయానికి గురవుతున్న ఓటర్లు జనం న్యూస్, నవంబర్ 05, అచ్యుతాపురం:నేడు జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అచ్యుతాపురం మండలంలోని పూడిమడక గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను మండల రిటర్నింగ్ అధికారి ఎం. యశ్వంత్‌తో పాటు మండల అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కొంతమంది ఓటర్లకు ఓటరు స్లిప్పులు అందకపోవడంతో తమ ఓటు ఏ పోలింగ్ కేంద్రంలోని ఏ నంబర్ స్టేషన్లో ఉందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.ఓటరు స్లిప్పులు అందని వారికి అధికారులు పోలింగ్ స్టేషన్ నంబర్లను తెలియజేసి, తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకునేలా సహకరించాలని స్థానికులు కోరుతున్నారు.