ఆంధ్రప్రదేశ్

వైకల్యం ఓటు హక్కుకు అడ్డంకి కాదు!

వైకల్యం ఓటు హక్కుకు అడ్డంకి కాదు!

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమే! జనం న్యూస్ నవంబర్ 5 కోటబొమ్మాళి మండలం :శారీరక వైకల్యం ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ఓటు హక్కును వినియోగించుకున్న ఓ దివ్యాంగుడు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పోలింగ్‌ కేంద్రంలో ఓ దివ్యాంగుడు తన ఓటు హక్కును వినియోగించుకున్న దృశ్యం పలువురిని ఆకట్టుకుంది.శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం కావాలనే ఆయన సంకల్పం అభినందనీయం. ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన హక్కు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో అవసరం. అర్హులైన ఓటర్లంతా ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలనే సందేశాన్ని ఈ దృశ్యం చాటిచెబుతోంది.వైకల్యం శరీరానికే తప్ప సంకల్పానికి కాదు ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకూ విలువ ఉందని ఈ దివ్యాంగుడి చైతన్యం నిరూపిస్తోంది.

ఇ-పేపర్