ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఆసుపత్రుల కాంట్రాక్టు కార్మికులకు నెలకు రూ.26 వేల వేతనం చెల్లించాలి

ప్రభుత్వ ఆసుపత్రుల కాంట్రాక్టు కార్మికులకు నెలకు రూ.26 వేల వేతనం చెల్లించాలి

జనం న్యూస్ 13 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్నూ తన తండాలను పిలిచే కార్మికుల జీతాలు పెంచాలి ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లించాలి చట్టబద్ధమైన సెలవులు బోనస్ ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి జోగులాంబ గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి ముందు తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఏ ఐ టి యు సి ఆధ్వర్యంలో ధర్నా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఈరోజు తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.ఈ ధర్నాలో ఏ ఐ టి యు సి యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.ఆంజనేయులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగన్న,తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటరామిరెడ్డి పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత 10 నుంచి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులకు నాలుగు సంవత్సరాలు దాటినా వేతనాలు పెంచకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం కొత్తగా విధుల్లో చేరే కార్మికులకు కూడా కనీసం రూ.16 వేల వేతనం నిర్ణయించిన నేపథ్యంలో సుదీర్ఘకాలంగా అనుభవంతో పనిచేస్తున్న కార్మికులకు నెలకు రూ.26 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.అలాగే చట్ట ప్రకారం పండుగ సెలవులు జాతీయ సెలవులు ఆర్జిత సెలవులు అమలు చేయాలని ప్రతి సంవత్సరం ఒక నెల వేతనాన్ని బోనస్‌గా చెల్లించాలని ప్రతి కార్మికుడికి రెండు జతల యూనిఫారాలు అందించాలని కోరారు. ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్ నిధులను కార్మికుల ఖాతాల్లో నిబంధనల ప్రకారం జమ చేయాలని డిమాండ్ చేశారు.కాంట్రాక్టర్లు కార్మికుల వేతనాల నుంచి ఈఎస్‌ఐ పీఎఫ్ పేరుతో మినహాయింపులు చేస్తున్నప్పటికీ కార్మికుల ఖాతాల్లో మాత్రం పూర్తి మొత్తాలు జమ చేయడం లేదని ఆరోపించారు. కార్మికులకు చెల్లించే వేతనానికి అనుగుణంగా చట్ట ప్రకారం ఈఎస్‌ఐ పీఎఫ్ సొమ్మును జమ చేయాలని కాంట్రాక్టర్లు నిబంధనలు పాటించకపోతే ముఖ్య యజమానిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.గతంలో ఆగస్టు 9న డీఎంఈ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నా సందర్భంగా ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని అప్పటి డీఎంఈ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించినప్పటికీ ఆ హామీ అమలు కావడం లేదన్నారు.కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన కాంట్రాక్టర్లను ఆహ్వానించి కార్మికులకు మెరుగైన వేతనాలు చట్టబద్ధమైన సెలవులు, బోనస్ ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు సేవలందిస్తున్న కాంట్రాక్టు కార్మికుల శ్రమను గుర్తించి వారి కుటుంబాలకు భద్రత కల్పించాలని కోరారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడుతామని మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కోశాధికారి ఆశన్న .ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కృష్ణ.జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ నాయకులు వెంకటేష్, మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకులు సూపర్వైజర్స్ భాషా నాగరాజ్ , సెక్యూరిట లక్ష్మణ్ శానిటేషన్ చామంతి, భాషా. చిట్టెమ్మ. అమరేష్. ఇంద్రమ్మ. జయమ్మతో పాటు ఆస్పత్రి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇ-పేపర్