జనం న్యూస్ 13 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ 13 మండలాలు 255 గ్రామపంచాయతీలు గుంతల రోడ్లతో ప్రజల ప్రయాణం నరకప్రాయం ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ గ్రామాల రోడ్ల పరిస్థితి మాత్రం మారడం లేదు జోగులాంబ గద్వాల జిల్లాలోని 13 మండలాలు 255 గ్రామపంచాయతీల పరిధిలో గ్రామీణ రహదారుల పరిస్థితిపై ప్రభుత్వం సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి గత ప్రభుత్వాలు మారాయి కొత్త ప్రభుత్వాలు వచ్చాయి అధికారులు మారుతున్నారు కానీ అనేక గ్రామాల్లో రోడ్ల పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది రెండు కిలోమీటర్లు ప్రయాణించాలంటే గేర్లు మార్చాలి క్లచ్ పట్టుకోవాలి బ్రేకులు వేయాలి. గుంతలు తప్పించుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతకంటే దారుణమైన రహదారి పరిస్థితి ఎక్కడైనా ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు రోడ్లు సరిగా లేక రైతులు తమ పంటలను మార్కెట్లకు తీసుకెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు తరలించడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రభుత్వానికి మా సూటి ప్రశ్నలు గ్రామీణ రహదారుల అభివృద్ధికి ఎప్పుడు నిధులు కేటాయిస్తారు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు ఎప్పుడు చేపడతారు ప్రతి మండలంలో రోడ్ల పరిస్థితిపై ప్రత్యేక సర్వే ఎందుకు చేయకూడదు శాంక్షన్ అయిన రోడ్డు పనులను వెంటనే ఎందుకు ప్రారంభించరు గ్రామీణ ప్రజలకు నాణ్యమైన రహదారి సౌకర్యం కల్పించే బాధ్యత ఎవరిది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన డిమాండ్ జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో దెబ్బతిన్న గ్రామీణ రహదారులపై ప్రత్యేక సర్వే నిర్వహించి, నిధులు మంజూరు చేసి, నాణ్యమైన బీటీ రోడ్లు నిర్మించాలి. రోడ్ల మరమ్మతులను వెంటనే ప్రారంభించాలి. రైతుకు రోడ్డు కావాలి. విద్యార్థికి రోడ్డు కావాలి. రోగికి రోడ్డు కావాలి. ప్రతి గ్రామ ప్రజలకు సురక్షితమైన రహదారి కావాలి మా నినాదం ఒక్కటే గుంతల రోడ్లు వద్దు నాణ్యమైన బీటీ రోడ్లు ముద్దు గ్రామాల అభివృద్ధే జిల్లా అభివృద్ధి ప్రజల రహదారి హక్కు మా పోరాటం ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆర్ అండ్ బి శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి గ్రామీణ రహదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం
ఇట్లు సింధనూరు ఉప్పరి గంగాధర్జి ల్లా అధ్యక్షులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా