జనం న్యూస్ 13 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్తె లంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై హత్య విత్తనానికి ఖండిస్తున్నాం ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు సింధనూర్ గంగాధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారం రావాలని మొట్ట మొదటిసారిగా బీసీ రాజ్యం కోసం పోరాడుతున్న వ్యక్తి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈరోజు జరిగినటువంటి హత్యాయత్నాన్ని ఖండిస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్న నాయకుడిని హత్య చేయడానికి కూడా వెనకాడడం లేదు కనుక బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ వర్గాలకు అండగా నిలుస్తున్న వ్యక్తినీ బీసీల కోసం పోరాడుతున్న ప్రతి ఒక్క ఉద్యమకారులని మట్టు పెడుతున్న అగ్ర నాయకులు ఈరోజు హత్య చేయడానికి కూడా వెనకాడని నాయకులు ఇదే ఖమ్మంలో దాడులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో ఉద్యమం చేయటానికైనా సిద్ధమే అని తెలియపరిచారు. బీసీలకు రాజ్యాధికారం వస్తే మమ్మల్ని అనిచివేస్తారని ఉన్నంత వర్గాలు ఈ హత్యాయత్నం చేయడం జరిగింది. మా నాయకుడికి ఏమైనా జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అందరూ ఏకమై అసెంబ్లీని ముట్టడిస్తామని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా మీడియా ఇంచార్జ్ విజె రాము అయిజ మండల అధ్యక్షులు ఇ సురేంద్ర గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి జుంజు కృష్ణ భాస్కర్ ఆంజనేయులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.