జనం న్యూస్ నవంబర్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ సీఐఐ భాగస్వామ్య సదస్సు 2026లో పాల్గొనేందుకు విశాఖపట్నం విచ్చేసిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర కోశాధికారి ఎం. నాగేంద్ర ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం వద్ద ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాకతో సదస్సుకు మరింత ప్రాధాన్యత లభించిందని నేతలు పేర్కొన్నారు. దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొనే ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు పెరిగేందుకు ఈ సదస్సు కీలక వేదికగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్నాయని, విశాఖను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు.