ఆంధ్రప్రదేశ్

ఒక్క మాట.. ఒక్క బాట.. కొమ్మరగిరిపట్టణ అభివృద్ధే లక్ష్యం

ఒక్క మాట.. ఒక్క బాట.. కొమ్మరగిరిపట్టణ అభివృద్ధే లక్ష్యం

జనం న్యూస్ నవంబర్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమ్మరగిరిపట్టణం: మన గ్రామం అంతా ఒక్క మాట మీద ఉండి మంచి అభ్యర్థితో అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కాలని తాను ఆశిస్తున్నానని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు అన్నారు. అల్లవరం మండలం కొమ్మరగిరిపట్టణం గ్రామ నేతల సమక్షంలో రాబోయే పంచాయతీ అధ్యక్షుల పదవి కోసం ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర నాయకులు యాళ్ల దొరబాబు మాట్లాడుతూ కూటమి నియమాలకు కట్టుబడి అందరూ పనిచేసి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు అవుదాం అన్నారు. గ్రామంలో విభేదాలు లేకుండా ఏకాభిప్రాయంతో అభ్యర్థిని ఎంపిక చేసుకుంటేనే అభివృద్ధి సాధ్యమని నేతలు స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే గ్రామ ప్రయోజనాలే ముఖ్యమని, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమావేశంలో గ్రామ పెద్దలు, యువ నాయకులు, కూటమి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు కృషి చేస్తామని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఇ-పేపర్