ప్రజల ఆదరణతోనే ఘన విజయం. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం జనం న్యూస్ నవంబర్ 13 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి నందికొట్కూరు మున్సిపాలిటీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ విజయాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలను అభినందించారు. ప్రజల ఆదరణ, నమ్మకంతో సాధించిన ఈ విజయం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. ప్రజల నమ్మకమే తమ బలమని, ప్రజాసేవే ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. ఈ విజయం ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని, భవిష్యత్తులోనూ ప్రజల ఆశయాలు, ఆకాంక్షల సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.