ఆంధ్రప్రదేశ్

శ్రీశ్రీశ్రీ శ్రీ మాణిక్యమాంబ సమేత సమరసానంద కోట్ల నల్ల ఆర్యుల నూతన గురు మందిరం ప్రారంభోత్సవం

శ్రీశ్రీశ్రీ శ్రీ మాణిక్యమాంబ సమేత సమరసానంద కోట్ల నల్ల ఆర్యుల నూతన గురు మందిరం ప్రారంభోత్సవం

జనం న్యూస్ నవంబర్ 13 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ గ్రామంలో గురువారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా శ్రీశ్రీశ్రీ మాణిక్యమాంబ సమేత కోట్ల నల్ల ఆర్యుల వారి నూతన గురు మందిరం ఘనంగా ప్రారంభం జరిగింది ఆశ్రమ నిర్మాణ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నూతన గురు మందిరం ప్రారంభోత్సవం జరిగింది గురువారం ఉదయం శ్రీ సమరసానంద కోట్ల నల్ల ఆర్యుల మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ప్రారంభించడం జరిగింది ఉదయం ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు తదనంతరం స్వామివారి పల్లకి సేవ విధుల గుండా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్మాణానికి ఆర్థికంగా సహకరించిన చిట్కుల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టి విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కే విట్టల్ రెడ్డి పెనుగండ్ల నాయకులు పెంటారెడ్డి భారతి నాగరాజు మాజీ ఎంపిటిసి వి సుభాష్ రెడ్డి ఆలయ నిర్మాణానికి ఆర్థికంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మందిర కమిటీ సభ్యులతో పాటు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ మాజీ సర్పంచ్ తాజా పాలకవర్గం సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది అనంతరం మండల ఎంపీడీవో మాజీ సెక్రటరీ తిరుపతి ప్రస్తుత సెక్రటరీ శోభారాణి వివిధ గ్రామాల సెక్రటరీలు అధికారులు అనధికారులు స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఆశ్రమ నిర్మాణ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి వైస్ చైర్మన్ పెంటారెడ్డి భూమిరెడ్డి కార్యదర్శులు మల్లేశం మేరు డాక్టర్ బోయిని సత్యనారాయణ బేర్ల కిష్టయ్య వివిధ గ్రామాలకు చెందిన గురు శిష్య బృందం పెద్ద ఎత్తున పాల్గొన్నారు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు తదనంతరం భోజన కార్యక్రమాలు స్వీకరించారు చిట్కుల్ గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొంది.

ఇ-పేపర్