ఆంధ్రప్రదేశ్

శ్రీవాణి పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు

శ్రీవాణి పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు

జనం న్యూస్;13 నవంబర్ శుక్రవారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ శ్రీవాణి స్కూలు భారత్ నగర్ లో శుక్రవారం రోజున ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చాచా నెహ్రూ వేషధారణతో పాటు వివిధ రకాల వేషధారణల్లో పాల్గొని ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా 220 విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. సత్యం మాట్లాడుతూ. పిల్లలంటే ఎంతో ఇష్టపడే పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మా పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇది 16వ సంవత్సరంగా పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు, వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్