ఆంధ్రప్రదేశ్

బ్రహ్మా కుమారీస్‌లో ఘనంగా భాయి దూజ్ వేడుకలు

బ్రహ్మా కుమారీస్‌లో ఘనంగా భాయి దూజ్ వేడుకలు

జనం న్యూస్;13 నవంబర్ శుక్రవారం సిద్దిపేట నియోజికవర్గ ఇంచార్జి వై.రమేష్ సిద్దిపేట బ్రహ్మా కుమారీస్‌ ఆధ్వర్యంలో భాయి దూజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీకే భవాని అక్కయ్య ఆధ్వర్యంలో అన్నదమ్ముల అందరూ బాగుండాలని హారతులని ఇచ్చి ప్రత్యేకంగా భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.అనంతరం కార్యక్రమంలో భాగంగా మానవ సమాచార హక్కు చట్టం రాష్ట్ర మహిళా కన్వీనర్ అయిన వీరమల్ల రమశ్రీ సంస్థ తరపున నిర్వాహకురాలు శాలువా పూలమాలతో ఘనంగా సత్కారం చేశారు, ఈ సందర్భంగా వారు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోదరసోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకోవాలని సందేశాన్ని అందించారు.

ఇ-పేపర్