ఆంధ్రప్రదేశ్

కాట్రేనికోనలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

కాట్రేనికోనలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

జనం న్యూస్ నవంబర్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన
మండలం: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన ఎన్నికల నోటిఫికేషన్‌ను కాట్రేనికోన మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ బి. రాజేశ్వర్ రావు, తహసీల్దార్ వి. రవికిరణ్ ఆధ్వర్యంలో ప్రచురించారు. మండలంలో ఉన్న 16 గ్రామ పంచాయతీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ప్రతీ గ్రామ పంచాయతీ నోటీసు బోర్డు నందు ప్రచురించాలని పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ ఎన్. శంకర్ నారాయణ, పరిపాలన అధికారి ఎం. సంఘమిత్ర, కాట్రేనికోన పంచాయతీ కార్యదర్శి జె.వి. సత్యనారాయణ పాల్గొన్నారు. నోటిఫికేషన్ విడుదలతో మండలంలో ఎన్నికల సందడి మొదలైందని అధికారులు తెలిపారు. నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్ తదితర వివరాలను గ్రామాల్లోని నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచామని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.

ఇ-పేపర్