జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు 18-11-2026 బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని సహారా ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రణధీర్ రెడ్డి సోదరి కుమాడు రణవీర్ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు._ ఈ వేడుకలకు పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై బర్త్‌డే బాయ్‌ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పుట్టినరోజు జరుపుకుంటున్న బాలుడికి శ్రీనివాస్ గౌడ్ అభినందనలు తెలిపి, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనసారా ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో చిన్నారులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, కౌన్సిలర్ జములమ్మ, మాజీ సర్పంచులు వెంకటేష్ సాగర్, సురేందర్ గౌడ్, రామన్ గౌడ్, షబ్బీర్, జగదీశ్వర్ రెడ్డి, చెలిమిల్ల రాముడు, మాలపల్లి రాములు పాల్గొని బాలుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.