ఆంధ్రప్రదేశ్

గుండారం ప్రాథమిక పాఠశాలలో క్విజ్ పోటీలు.

గుండారం ప్రాథమిక పాఠశాలలో క్విజ్ పోటీలు.

జనం న్యూస్ 23 నవంబర్ సోమవారo సిద్ధిపేట నియోజిక వర్గ ఇంచార్జి వై. రమేష్ బెజ్జంకి మండలంలోని ప్రాథమిక పాఠశాల గుండారంలో సోమవారం రోజున రెండవ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీ పుల్లూరు ప్రభాకర్ గారు పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. క్విజ్ పోటీలో పాల్గొన్న పిల్లల యొక్క ప్రతిభను అభినందిస్తూ ,కంప్యూటర్ కంటే వేగంగా పనిచేసే మేధాశక్తి పిల్లలకు ఉంటుందని చిన్నప్పటినుండి పిల్లలు విభిన్నంగా చదవడంలో ప్రతిభను కనబరచాలని సూచించారు. పిల్లల్లో మేధాశక్తి నీ పెంచేలా విద్యార్థులకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. ప్రాథమిక స్థాయిలోనే ఈ విధంగా పిల్లలకు క్విజ్ పోటీలతో మేధాశక్తి పెంపించడానికి కృషి చేస్తున్న ప్రాథమిక పాఠశాల గుండారం ఉపాధ్యాయ బృందాన్ని ప్రశంసించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉండ్రాళ్ళ తిరుపతి, ఉపాధ్యాయులు జంగోని శ్రీనివాస్, ప్రమోద్, శిరీష,హరీష, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఇ-పేపర్