ఆంధ్రప్రదేశ్

శ్రీవాణి స్కూల్లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు

శ్రీవాణి స్కూల్లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ 23 నవంబర్ సోమవారం సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని శ్రీవాణి స్కూల్లో స్వపరిపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా సోమవారం రోజున నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా, పాఠశాల నిర్వాహకులుగా వివిధ బాధ్యతలు చేపట్టి తరగతులను నిర్వహిస్తూ పాఠాలు బోధించారు.
ఎ. వైష్ణవి (డీఈఓ), బి.నవీన (కరెస్పాండెంట్ ) ,ఆర్ .హాసిని (ప్రిన్సిపాల్) పీఈటీ భార్గవి, రేవంత్ తదితరుల పాత్రలను విద్యార్థులు పోషించారు. అలాగే లాస్యశ్రీ, హర్షిత, నివేదిత్, నిహాల్, ఫణీంద్రనందన్ తదితరులు ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి. హెచ్ సత్యం మాట్లాడుతూ, విద్య అనేది కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా జీవితానికి మార్గదర్శకంగా నిలవాలని అన్నారు. ప్రతి విద్యార్థిలోనూ ఒక నాయకుడు దాగి ఉంటాడని, వారిలోని ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. సేవాభావం, క్రమశిక్షణ, బాధ్యత, పరస్పర గౌరవం వంటి విలువలను అలవర్చుకున్నప్పుడే విద్యార్థులు మంచి పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమలోని అంతర్గత శక్తిని గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇ-పేపర్