జనం న్యూస్ నవంబర్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఆరు శతాబ్దాల చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం ఉదయం నుండి రాత్రి వరకు కార్తీక మాస దీపోత్సవాలను వైభవంగా నిర్వహించినారు. రాత్రి శివపార్వతులకు ఉంజల్ సేవను అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి నిర్వహించినారు. రాత్రి జ్వాలాతోరణం నిర్వహించి పాలలో చంద్రుని చూసినారు అనంతరం దేవాలయ చైర్మన్ సామల భిక్షపతి రాజమణి దంపతులు శ్రీ మత్స్యగిరి స్వామి కి అభిషేకం కోసం పంచలోహ విగ్రహాన్ని అందజేసినారు భక్తులు దీపాలు దేవాలయ ఆవరణ చుట్టు వెలిగించినారు. భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.