ఆంధ్రప్రదేశ్

గద్వాల ఆర్టీఓ కార్యాలయం ఎదుట లారీ డ్రైవర్ల ఆందోళన

గద్వాల ఆర్టీఓ కార్యాలయం ఎదుట లారీ డ్రైవర్ల ఆందోళన

జనం న్యూస్ 27 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్జో గులాంబ గద్వాల్ జిల్లా లారీలను అడ్డుపెట్టి నిరసన.. రవాణా శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట లారీ అసోసియేషన్ సభ్యులు లారీ డ్రైవర్లు ఆకస్మిక ఆందోళనకు దిగారు. తమ లారీలను కార్యాలయం ముందు నిలిపివేసి జిల్లా రవాణా అధికారి (డీటీఓ) వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.వాహనాలకు స్టిక్కర్లు వేసే పేరుతో రవాణా శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని డ్రైవర్లు ఆరోపించారు. అంతేకాకుండా ఎలాంటి సరైన కారణాలు లేకుండానే జరిమానాలు విధిస్తూ తమను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని లారీ అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.లారీలను కార్యాలయం ఎదుట నిలిపివేయడంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రవాణా శాఖ అధికారులు స్పందించి అక్రమ వసూళ్లను నిలిపివేయాలని డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇ-పేపర్