జనం న్యూస్ నవంబర్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రైతులు ప్రైవేటు రైస్ మిల్లర్లను ఆశ్రయించి మోసపోవద్దని, ప్రభుత్వ ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని హన్మకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి సూచించారు.మండలంలోని పెద్దకోడెపాక గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియను పరిశీలించి, రైతులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. గన్నీ బ్యాగులు అందుబాటులో లేకపోవడంపై కారణాలు తెలుసుకున్నారు. వెంటనే గన్నీ బ్యాగులు తెప్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.సన్న వడ్లకు ప్రభుత్వం బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్.ప్రవీణ్‌కుమార్, ఆర్‌ఐ ఏ.చిమన్ నాయక్, ఏఈఓ గట్టు అన్వేష్,సర్పంచ్ మంద దీన ప్రభాకర్, జీపీఓ బోగి దేవేందర్ రైతులు తదితరులు పాల్గొన్నారు.