జనం న్యూస్ నవంబర్ 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈరోజు కార్తీక మాసంలో శ్రీ సర్వ కామదాంబ సమేత భోగలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామివారి కి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకంలో ఉదయం నుంచి స్వామివారికి గణపతి పూజ పుణ్యాహవాచనం మండపారాధన మహాన్యాసం మరియు స్వామివారికి ఏకాదశ వార అభిషేకము నీరాజనం మంత్రపుష్పములు నిర్వహించడం జరిగిందని చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ తెలియజేశారు.ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన వారు ఆలయ అర్చకులు పేరూరి నారాయణరావు వారి కుమారులు బుజ్జి వేణు పేరూరి భీమేశ్వర రావు వారి కుమారులు పరమేశ్వర రావు చిన్ని వెలవలపల్లి సాయికుమార్ శర్మ వంశి వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని సుమారు 15 మంది దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు పెంటకోట అనూష గణేష్ మల్ల సూరిబాబు యలమంచిలి బంగారు రాజు బాదంపూడి కొండమ్మ మద్దాల నారాయణరావు కొట్రహరి రాపేటి నాగ సంతోష్ దూలం సత్యవతి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని సత్యనారాయణ తెలిపారు.//