జనం న్యూస్ 27 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్తె లంగాణ రాజ్యాధికార పార్టీ ప్రజా డిమాండ్ 27 నవంబర్ 2026, శుక్రవారం అలంపూర్ నియోజకవర్గ పర్యటనకు వస్తున్న మంత్రులు సీతక్క వాకిటి శ్రీహరి ఎంపీ మల్లు రవి సంపత్ కుమార్ కి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున విజ్ఞప్తి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు సింధనూరు ఉప్పరి గంగాధర్ మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గం పేదలు రైతులు, వ్యవసాయ కూలీలు అధికంగా నివసించే వెనుకబడిన ప్రాంతం. సుమారు 130 గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి మా మొదటి డిమాండ్ అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధికి 200 కోట్ల రూపాయలు కేటాయించాలి రెండవది ప్రతి గ్రామానికి నాణ్యమైన రోడ్డు సౌకర్యం కల్పించాలి.మూడవది అయిజలో 33 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి.నాలుగవది జోగులాంబ గద్వాల మెడికల్ కాలేజీ విద్యార్థులకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలి. విద్యార్థులు, మహిళలు ప్రజలు రవాణా సమస్యలతో ఇబ్బందులు పడకుండా చూడాలి.ఐదవది ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఆరవది గ్రామాల్లో తాగునీరు డ్రైనేజీ వైద్య సదుపాయాలు మెరుగుపరచాలి మంత్రుల పర్యటనను మేము స్వాగతిస్తున్నాం. కానీ పర్యటనలతో పాటు ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రభుత్వానికి స్పష్టమైన డిమాండ్ చేస్తున్నాం.అలంపూర్‌కు 200 కోట్లు కేటాయించాలి ప్రతి గ్రామానికి రోడ్డు కల్పించాలి అయిజకు 33 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి విద్యార్థులకు బస్సులు కల్పించాలి పేద ప్రజలకు న్యాయం చేయాలి హామీలు కాదు చేతల్లో అభివృద్ధి చూపించండి! ధన్యవాదాలు సింధనూరు ఉప్పరి గంగాధర్
జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ.