జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు 27-11-2026 పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా 220 మందికి చేయూత పింఛన్లు మంజూరైన సందర్భంగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సంబరాలు మిన్నంటాయి.మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పింఛన్లు పొందిన లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి చిత్రపటాలకు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు._ఈ సందర్భంగా కొత్తగా పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమ కష్టాలను గుర్తించి పింఛన్లు మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జీవితంలో మర్చి పోలేమని పేర్కొన్నారు. నిరుపేదల పక్షపాతిగా నిలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, కౌన్సిలర్లు జమ్మలమ్మ, శివ సాయి, భాగ్యలక్ష్మి శివ,మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, రణధీర్ రెడ్డి, మాజీ సర్పంచులు వెంకటేష్ సాగర్, సురేందర్ గౌడ్, మాజీ వార్డ్ మెంబర్ సుధాకర్ గౌడ్, మాజీ డైరెక్టర్ రామన్ గౌడ్, వినయ్, ఉత్తమ్ కుమార్, మేకల ఎల్ల స్వామి, బాలరాజు, రంగం నరసింహ, సైకిల్, మాలపల్లె రాములు, ధూపం రంగస్వామి, కంచరాపల్లి బాల గౌడ్, వివిధ వార్డుల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.