కార్యకర్త వెన్నంటే భాజపా

May 30, 2026 | తెలంగాణ

జనం న్యూస్ మే 30 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం వాస్తవ్యుడు భారతీయ జనతా యువమోర్చా గోదావరి జోన్ ఇన్చార్జ్ (కాకినాడ, తూర్పుగోదావరి,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి,ఏలూరు, కృష్ణాజిల్లాలు) కొండేటి ఈశ్వర్ గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడినందున అతనిని మరియు కుటుంబ సభ్యులను ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్న బీజేవైఎం గోదావరి జోన్ ఇంచార్జ్ ఈశ్వర్ గౌడ్ ని రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్..అధైర్య పడవద్దని తమకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఆయన వెంట ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేతిరెడ్డి ఆదిత్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాశిన ఫణీంద్ర, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,గణాల సాయి, తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper