ప్రభుత్వం వికారాబాద్ జిల్లా రెవెన్యూ ఉద్యోగులకు న్యాయం చేయాలి జి. విజయేందర్

May 7, 2026 | వైరల్ వార్తలు

రెవెన్యూ అసోసియేషన్ (ట్రెసా) అధ్యక్షులు వికారాబాద్ జిల్లా.
జనం న్యూస్ మే 7, వికారాబాద్ జిల్లా, ప్రస్తుతం జరుగుతున్న సాధారణ బదిలీలలో వికారాబాద్ జిల్లా రెవెన్యూ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. జోనల్ పోస్టులుగా ఉన్న నాయబ్ తహసీల్దారులు, సీనియర్ అసిస్టెంట్లు, గిర్ధావర్లకు ప్రస్తుతం పనిచేసే స్టేషన్ (కార్యాలయ పరిధి) యొక్క కాల పరిమితిని లెక్కింపులోకి తీసుకొని ఒకే స్టేషన్లో నాలుగు సంవత్సరాలు పూర్తి కాలేదు అనే కారణంతో బదిలీలకు నోచుకోవట్లేదు. సాధారణంగా రెవెన్యూ ఉద్యోగులకు రెండు/ మూడు సంవత్సరాలు అయిన పిమ్మటే అంతర్గత బదిలీలలో భాగంగా జిల్లా కలెక్టర్లు ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. దీనిని సాకుగా చూపి, ఒకే స్టేషన్లో నాలుగు సంవత్సరాలు పూర్తి కాలేదని, చార్మినార్ జోన్ పరిధిలో ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలకు బదిలీ చేయడం లేదు. వికారాబాద్ జిల్లా ఉద్యోగులపై వివక్ష చూపుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు వికారాబాద్ జిల్లా ఉద్యోగులను రానివ్వకుండా ఈ యొక్క చిన్న తిరకాసుతో అన్యాయం చేస్తున్నారు. కావున ప్రభుత్వం ఈ విషయంపై సానుకూలంగా స్పందించి జోనల్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు జిల్లా స్టేషన్ గా పరిగణించి ఈ యొక్క బదిలీలు పారదర్శకంగా జరగాలి. ముఖ్యమంత్రి , స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాకు తగిన న్యాయం చేయాలని రెవెన్యూ ఉద్యోగులు ముక్తకంఠంతో కోరుతున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం జరిగిన బదిలీలలో వికారాబాద్ జిల్లా నుండి 40 మంది పైగా ఉద్యోగులను కేవలం హైదరాబాద్ జిల్లాకు బదిలీ చేసి, హైదరాబాద్ జిల్లా ఉద్యోగులు వికారాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. కానీ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఉద్యోగులను బదిలీ చేయలేదు.సీసీఎల్ఏ కార్యాలయ ఉన్నతాధికారులు వికారాబాద్ జిల్లాకు తగు న్యాయం చేయాలని కోరారు.

🌐 Select Language:
📰 ePaper