తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పెబ్బేరు మండల భారతీయ జనతా పార్టీ నాయకులు
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు జూన్ 2 2026 తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం. విద్యార్థులు, యువత, ఉద్యోగులు, రైతులు చేసిన పోరాటం, త్యాగం ఎన్నటికీ మరువలేనిది. ఈ పవిత్ర దినాన తెలంగాణ అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పిద్దాం. వారి ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి, సుశాసనం, పారదర్శక పాలనతో తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, రైతుల సంక్షేమానికి, యువత భవిష్యత్తుకు, పేదల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేస్తోంది.అని భారతీయ జనతా పార్టీ పెబ్బేరు మండల కార్యకర్తలు మరియు నాయకులు తెలియజేయడం జరిగింది.