తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ

June 2, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 2 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో చండూరు గ్రామంలో ఉదయం తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా జెండా ఆవిష్కరణ గ్రామ సర్పంచ్ చేశారు గ్రామ సర్పంచ్ అలాగే సెక్రటరీ మాట్లాడుతూ అమరుల త్యాగాలు ప్రజల ఆకాంక్షలు ఉద్యమస్ఫూర్తితో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి ప్రతి యువకుడికి అవకాశాలు లభించాలి వికసిత తెలంగాణ నిర్మాణంలో మనమంతా భాగస్వామ్యం కావాలి ఎంతోమంది ప్రాణాలు అర్పించి తెలంగాణను సాధించారు అమరవీరుల సాక్షిగా తెలంగాణ ఏర్పడింది అని తెలియజేశారు అలాగే చండూరు గ్రామంలో అంగన్వాడి స్కూల్లో జెండా ఎగురవేసి అదనంతరం పిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టారుఈ కార్యక్రమంలో చండూరు గ్రామ సర్పంచ్ శేషాద్రి ఉప సర్పంచ్ మన్నే వెంకటేశం గ్రామపంచాయతీ సెక్రటరీ తిరుపతి వార్డు మెంబర్లు సరోజ బాలేష్ లక్ష్మణ్ లక్ష్మి యాదగిరి ప్రైమరీ స్కూల్ టీచర్లు అలాగే అంగన్వాడి టీచర్లు ఆయాలు గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper