వేసవి శిక్షణ శిబిరాలను జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కుమార్ రాజు ఆకస్మిక తనిఖీ

June 2, 2026 | తెలంగాణ

జనం న్యూస్,జూన్ 02,అచ్యుతాపురం: అచ్యుతాపురం శాఖా గ్రంధాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలు విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వివిధ పాఠశాలల విద్యార్థులు నీతి పద్యాలు, పొడుపు కథలు, జనరల్ నాలెడ్జ్ అంశాలను నేర్చుకుంటున్నారు. గ్రంధాలయంను విశాఖపట్నం జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి బి కుమార్ రాజు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పావురాల కధను బోధించి, నీతిని విద్యార్థులతో చెప్పించిమెప్పించారు. స్థానిక గ్రంథాలయ అధికారి ఎల్ వి రమణ ఆధ్వర్యంలో జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహణ పట్ల పిల్లల భాగస్వామ్యం మరియు బోధనా విధానం పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులకు శీతల పానీయాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠకులు శివకృష్ణ, నరేంద్ర,రాజేష్ సింహాద్రి ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper