హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వై. నరోత్తమ్

June 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 03. 06. 2026 సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తం హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఆయు రారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నో సేవలు అందించిన నాయకుడిగా హరీష్ రావు మరింత కాలం ప్రజలకు అందుబాటులో ఉండాలని నరోత్తం అభిలషించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నాయకత్వాన్ని కొనియాడారు. హరీష్ రావు రాజకీయ ప్రస్థానం ప్రజల మధ్య విశేష ఆదరణ పొందిందని, భవిష్యత్తులోనూ ప్రజాసేవలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ నరోత్తం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper