ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరా అందించిన తెలంగాణ ప్రభుత్వం
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు జూన్ 04 2026 ప్రతి మహిళకు చీర అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ ఉచితంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పెబ్బేరు మున్సిపాలిటీ 5 వ వార్డులో మహిళలందరికీ చూడ చక్కటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ వైస్ చైర్మన్ విజయ వర్ధన్ రెడ్డి కౌన్సిలర్ భాగ్యలక్ష్మి శివ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి నాయకులు రాజు గౌడ్ బుల్లెట్ రాముడు డైరెక్టర్ రాముడు పరశురాముడు పార్టీ కార్యకర్తలు మహిళా సమాఖ్య సభ్యులు ఆర్పీలు పాల్గొన్నారు.ప్రభుత్వం మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు అందించడం పట్ల మహిళామణులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కి మరియు వనపర్తి ఎమ్మెల్యే శ్రీ తూడి డి మేగా రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.