వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి.

May 8, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 08 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ రైతుల వడ్లు రాశులు (డంపింగ్) ను సందర్శించిన నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు రైతులు పండించిన పంట కొనుగోలు చేయడంలో రాష్ట్ర మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం త్రీవ నిర్లక్ష్యం వహిస్తుందని బాసు హనుమంతు నాయుడు ఆరోపించారు.ఈరోజు గద్వాల నియోజకవర్గం *గట్టు* మండలం *మాచర్ల* గ్రామంలో *వడ్ల డంపింగ్ ను రైతులు,పార్టీ నాయకులతో కలిసి,ఆయన సందర్శించారు* అనంతరం,*పి ఎ సి యస్ చైర్మెన్, సంబంధిత అధికారులతో చరవాణి ద్వారా మాట్లాడి,వెంటనే కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమాచర్ల గ్రామంలో రైతులు 25 రోజుల నుంచి వడ్లను డంపింగ్ చేసినా,కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు.అధికారులు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు..కాంగ్రెస్ ప్రభుత్వం సాగు నీళ్లు అందించడంలో వైఫల్యం,కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో వైఫల్యం,కాంటాలు పెట్టడంలో వైఫల్యం, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించడంలో వైఫల్యం, బడాయిగా చెప్పిన బోనస్ అందజేయడంలో ఘోర వైఫల్యం చెందిందని అన్నారు. ఈదురుగాలులు, అకాల వర్షాలతో రైతులు దినదినగండంగా గడుపుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది అని మండిపడ్డారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఏ ఒక్క రైతూ నష్టపోకుండా ప్రతి రైతుకూ మద్దతు ధర అందేలా చర్యలు తీసుకున్నారు అని అన్నారు. కెసిఆర్ గారు పంటలు కోయకంటే ముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే వారని పంటలు వేయకంటే ముందే పంట ఖర్చుల కోసం రైతు బందు ఇచ్చే వారని పంట కొనుగోలు చేసాక వెంటనే డబ్బులు ఇవ్వడం తో పాటు బోనస్ కూడా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేవారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper