ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
మండల విద్యాధికారి పి విట్టల్
జనం న్యూస్ జూన్ 5 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం 2026 27 విద్య సంవత్సరానికి పూర్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్చర్ ఆయా పోస్టుల తాత్కాలిక నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి గారి ఆదేశాల ప్రకారం 26 27 విద్యా సంవత్సరానికి గాను చిలిపి చెడు మండలంలోని ప్రాథమిక పాఠశాల గౌతాపూర్, చండూర్ గంగారం ఫైజాబాద్ ప్రాథమిక పాఠశాలలో ఖాళీగా ఉన్న ప్రీ ప్రైమరీ ఇన్స్పెక్టర్ ఆయా పోస్టులను పూర్తిగా తాత్కాలిక ప్రతిపాదన భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది పోస్టుల వివరాలు అర్హతలు ప్రీ ప్రైమరీ ఇన్స్పెక్టర్ ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి ప్రారంభ బాల్య విద్య లేదా ప్రాథమిక బోధన సంబంధిత అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఎంపికైన అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ నిర్దేశించిన శిక్షణను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది ఆయా కనీస విద్యా అర్హత పదవ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి ఎంపికలో ప్రాధాన్యత క్రమం అదే నివాస ప్రాంతం అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత అదే గ్రామపంచాయతీ అభ్యర్థులకు ద్వితీయ ప్రాధాన్యత అదే మండలానికి చెందిన అభ్యర్థులకు తదుపరి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది వయోపరిమితి 5 6 2026 నాటికి అభ్యర్థుల వయసు 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి వయో సడలింపు ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మాజీ సైనికులకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు 10 సంవత్సరాల వయసుడలింపు కలదు తర్వాత కలిగిన మండల అభ్యర్థులు తమ విద్యా అర్హతలకు సంబంధించిన అన్ని ద్రోపత్రాల జిరాక్స్ పత్రులను జత చేసి చిలిపి చెడు మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ విట్టల్ గారి కార్యాలయంలో జెడ్పిహెచ్ఎస్ సోమక్కపేట లో నిర్ణీత గడువులోగా 9 6 2026 సాయంత్రం లోపు దరఖాస్తులను సమర్పించాలి ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే ఉంటాయి