161 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఒకరి మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు.

June 6, 2026 | తెలంగాణ

బిచ్కుంద జూన్ 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం పత్లాపూర్ గ్రామ శివారు 161 జాతీయ రహదారిపై రెండు బైకులు డికొన్న ఘటన లో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు రెండు బైకులు ఎదురెదురుగా వచ్చి డి కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన వారిలో జుక్కల్ మండలం కేమ్రాజ్ కల్లలి గ్రామానికి చెందిన పసుముల రమేష్ 35 కాగా గయ పడిన వారిలో ఒకరు కేమ్రాజ్ కల్లలి కి చెందిన విఠల్ ఉపాధ్యాయుడు, మరో వ్యక్తి కేమ్రాజ్ కల్లలి గేట్ సమీపంలోని పంక్చర్ షాప్ లో మెకానిక్ గా పని చేసే మహబూబ్ లుగా స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

🌐 Select Language:
📰 ePaper