బిజెపి కాట్రేనికోన మండలం కార్యవర్గ సమావేశం
జనం న్యూస్ జూన్ 8 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం భారతీయ జనతా కాట్రేనికోన మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు మట్టా శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి జనరల్ సెక్రెటరీ సలాది వీరబాబు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ వారు 12 సంవత్సరాల పాలన, పర్యావరణ దినోత్సవ సందర్బంగా మొక్కలు నాటే కార్యక్రమం, యోగ దినోత్సవం గురించి మండల కార్యకర్తలకి వివరించారు ఈ కార్యక్రమంలో కాట్రేనికోన మండల ఇంచార్జ్ ఆకుమర్తి బేబీ రాణి , బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ మరియు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మట్ట సూరిబాబు, మరో సీనియర్ నాయకులు సుంకర నాగేశ్వరరావు మండల జనరల్ సెక్రటరీ కోటా సత్య ప్రసాద్ కొత్తలంక సురేష్ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశాన్ని ముఖ్య అతిథిగా వచ్చిన సలాది వీరబాబు సమావేశం ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.కేంద్ర ప్రభుత్వ పధకాలు గురించి వివరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి బూత్ కి వెళ్లి ప్రజల క్షేమ సమాచారం కొనుక్కుని వారి సమస్యలు అర్థం చేసుకోవాలి అనంతరం వారికి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించమన్నారు వివరించమన్నారు మండల కార్యవర్గ సభ్యులు సూచన చేసినారు. తదనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా భారత ప్రధాని పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు పి వి ఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ సూచన మేరకు భారతీయ జనతా పార్టీ అమ్మ కోసం ఒక మొక్క నాటుదాం కార్యక్రమం లో మొక్కలు నాటడం జరిగింది.