నీటి ట్యాంకును శుభ్రం చేయించిన పంచాయితీ కార్యదర్శి
జనం న్యూస్. తర్లుపాడు మండలం జూన్. 9 : తర్లుపాడు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న తాగునీటి ట్యాంకును పంచాయితీ కార్యదర్శి సుభాకర్ ఆధ్వర్యంలో శుభ్రం చేయించారు. ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించే లక్ష్యంతో, ట్యాంకును పూర్తిగా క్లీన్ చేయించి, దానికి సున్నం వేయించి కొత్త రూపు ఇచ్చారు.అంతేకాకుండా, ట్యాంకుకు ఉన్న పాత కొళాయిలను తొలగించి, కొత్త వాటిని బిగిస్థామన్నారు. తద్వారా నీటి వృథాను అరికట్టడంతో పాటు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నీటి సరఫరాను మెరుగుపరిచేలా చేస్తామని అన్నారుఈ సందర్భంగా పంచాయితీ కార్యదర్శి సుభాకర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ట్యాంకు పైకప్పు అద్వానంగా మారిందని, దీనివల్ల నీటి కలుషితం అయ్యే అవకాశం ఉందని గుర్తించామన్నారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా, త్వరలోనే పాత పైకప్పును తొలగించి, కొత్త పైకప్పును ఏర్పాటు చేస్తామని ఆయన హామీఇచ్చారు.స్థానికప్రజలకుఅందుబాటులో ఉండి, ప్రాథమిక సౌకర్యాల కల్పనలో చొరవ చూపుతున్న కార్యదర్శి సుభాకర్ పనితీరును స్థానికులుఅభినందిస్తున్నారు.