మాన్యాపూర్ గ్రామం లో 100% స్వీయ జన గణన పూర్తి తహసీల్దార్ వేణుగోపాల్

జనం న్యూస్; కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని మాన్య పూర్ గ్రామంలో శుక్రవారం స్వీయ జనగణనను 100% పూర్తి చేసినట్లు తహసీల్దార్ వేణుగోపాల్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాన్య పూర్ గ్రామంలో ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబం ను జనగణన లో పేర్కొన్న అన్ని అంశాలను చాలా పకడ్బందీగా స్వీయ జనగణనలో నమోదు చేయడం జరిగింది అని తెలిపారు.ఈ స్వీయ జనగణనలో నమోదుకు ప్రజలకు అవగాహన కల్పించడానికి రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు ఈ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు.ప్రజలంతా నేడు సెల్ ఫోన్లు వాడుతున్నందున స్వీయ జనగణన చేసుకోవాలని పిలుపునిచ్చారు.ప్రజలకు స్వీయ గణన పై గ్రామాలలో ప్రచార రథం ద్వారా విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది అని తెలిపారు. – స్వయంగా వివరాలను నమోదు చేసుకోవడం కోసం పౌరులు తమ కుటుంబ వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా సొంతంగా మొబైల్ లేదా కంప్యూటర్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది అన్నారు.https://se.census.gov.inపై పోర్టల్ (లింక్ ద్వారా) ఈ నెల 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు వివరాలు నమోదు చేసుకోవచ్చు అన్నారు.కార్యాలయంలో అవగాహన కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిరు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్ ఎంపీడీవో గోపాల్ బిచ్కుంద మండల్ 10 జి పి ఓ ఎస్ మరియు 10 పంచాయతీ సెక్రెటరీ మరియు తాసిల్దార్ సిబ్బంది గ్రామ సర్పంచ్ వార్డ్ మెంబర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.