ఆల్విన్ కాలనీ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. మాజీ కార్పొరేటర్లు

June 12, 2026 | తెలంగాణ

జనం న్యూస్ మే 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; కూకట్పల్లి నియోజకవర్గ రాజకీయ వర్గాల్లో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందిన ఆల్విన్ కాలనీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అనిల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేకంగా హాజరై అనిల్ రెడ్డికి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనిల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని పేదలకు ఆహారం పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మేలు చేయాలనే సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మాధవరం రంగారావు, జూపల్లి సత్యనారాయణ, బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు, శ్రీకాంత్ సాయి తదితరులు పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అనిల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.నాయకులు, కార్యకర్తల సందడి మధ్య జరిగిన ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.

🌐 Select Language:
📰 ePaper