ePaper

కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పుల కలకలం

May 3, 2026 | క్రైమ్ వార్తలు

జనం న్యూస్: కరీంనగర్‌లో కాల్పులు కలకలం రేపాయి. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు చోటుచేసుకున్నాయి. పీఎంజే జ్యువెలరీ షాపులోకి ప్రవేశించిన దుండగులు కాల్పులు జరిపారు. మొత్తం ఆరుగురు దుండగులు జ్యువెలరీ షాపులోకి ప్రవేశించినట్టుగా చెబుతున్నారు. అనంతరం వారు జ్యువెలరీ షాపులోని సబ్బందిని కట్టేసి బంధించారని తెలుస్తోంది. తర్వాత షాపులో కాల్పులు జరిపి భారీగా ఆభరణాలను తీసుకుని వెళ్లిపోయినట్టుగా సమాచారం. ఈ కాల్పులు పీఎంజే జ్యువెలరీ షాపుకు చెందిన ముగ్గురు సిబ్బందికి గాయాలయ్యాయి. దీంతోవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పీఎంజే జ్యువెలరీకి చేరుకున్నారు. పీఎంజే జ్యువెలరీ లోపల, పరిసరాలను పరిశీలించారు. అసలేం జరిగిందనేది సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే, అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అలాగే, నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.