అభివృద్ధికి ఆమెడ దూరంలో విశ్వకర్మలు సాంస్కృతిక శాఖ సలహాదారుడు దరువు అంజన్న

June 15, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కొన్ని వేల సంఖ్యలో విశ్వకర్మలు జీవిస్తున్నప్పటికీను రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తూ వీళ్ళ ఓట్లను దండుకుంటున్నారే తప్ప వీరికి సరైన సౌకర్యాలు కల్పించట్లేదని కనీసం ఒక కమిటీ హాల్ కూడా నిర్మించలేదని తెలంగాణ ప్రభుత్వ టూరిజం మరియు సాంస్కృతిక శాఖ సలహాదారులు దరువు అంజన్న అన్నారు. ఈరోజు సూరారం,విశ్వకర్మ కాలనీలో జరిగిన శ్రీ విరాట్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ద్వితీయ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన ప్రసంగించారు. గత రెండు సంవత్సరాల కింద ఎమ్మెల్యే వివేకానంద జగద్గిరి గుట్టలో విశ్వకర్మలకు కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని శపతం చేశారని, అదే విధంగా కైసర్ నగర్ ప్రాంతంలో విశ్వకర్మ జాతీయులకు స్థలాన్ని కేటాయిస్తానని హామీ ఇచ్చారని కానీ ఆ మాటను ఇప్పటికీ నిలబెట్టుకోలేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే విశ్వకర్మలను చిన్నచూపు చూడకుండా వారికి స్థలాన్ని కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మించి విశ్వకర్మల ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ విరాట్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సేవా సంఘం అధ్యక్షులు పొలిగారం కృష్ణమాచారి, ప్రెసిడెంట్ కమ్మరి లక్ష్మణాచారి మరియు ఎస్ ఆర్ నాయక్ నగర్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఆలూరి శేషాచారి తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper