జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోమక్కపేటలో నూతన విద్యార్థులకు ఘన స్వాగతం

June 15, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 15 చిలిపి చెడు మండల ప్రతినిధి : మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్ సోమక్కపేట పాఠశాలలో నూతన విద్యా సంవత్సరం సందర్భంగా విద్యార్థులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొత్తగా చేరిన విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ప్రధానోపాధ్యాయులు పి .విట్టల్ గ్రామ సర్పంచ్ దుర్గాచలం ఉప సర్పంచ్ మేకల నరేష్ అతిథులుగా పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన పథకం వంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి, క్రమశిక్షణతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమం పాఠశాల ఉపాధ్యాయులు,అజయ్ కుమార్ , యాద గౌడ్ ,మోహన్ ,మహేష్ కుమార్ ,విష్ణువర్ధన్, రమాదేవి ,సంగీత విద్యార్థులు, తల్లిదండ్రులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper