రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ప్రత్యామ్నాయంగా అవతరించిన ‘ తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీ వైపు సంగారెడ్డి జిల్లా యువత
జనం న్యూస్ తేదీ 16-06-2026 : భారీగా ఆకర్షితులవుతోంది. పార్టీ ఆవిర్భావ సమయం నుంచి ప్రజల్లోకి బలంగా వెళ్తున్న సిద్ధాంతాలు, ముఖ్యంగా ఐదు ప్రధాన ఎజెండాలతో కూడిన “పాంచజన్యం” నినాదం నియోజకవర్గంలోని యువతీ యువకులను విశేషంగా ప్రభావితం చేస్తోంది. సంగారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ కలబ్ గుర్ దయాకర్ రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే నియోజకవర్గవ్యాప్తంగా వందల సంఖ్యలో యువకులు, స్థానిక నాయకులు పార్టీలో చేరుతుండటంతో క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ (రక్షణ సేన) శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.యువతను కదిలిస్తున్న ‘పాంచజన్యం’ ఎజెండా సమాజంలో సమూల మార్పులే ధ్యేయంగా పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించిన ‘పాంచజన్యం’ ప్రణాళికే తమ పార్టీకి శ్రీరామరక్ష అని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. తెలంగాణ రక్షణ సేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వచ్చే నెల (జూన్) 7వ తేదీన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని ‘తెలంగాణ తల్లి’ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. పార్టీ అధికారికంగా ఏర్పాటైన తర్వాత జిల్లాలో జరిగే మొదటి కీలక కార్యక్రమం కావడంతో స్థానిక నాయకత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.