బీసీ విద్యార్థి సంఘం నాయకుల ముందస్తు అరెస్ట్
జనం న్యూస్-జూన్ 18- నాగార్జునసాగర్ టౌన్- బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన నాగార్జునసాగర్ బీసీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కోడా విజయ్, మల్లెపోగు సునీల్ కుమార్ లను ముందస్తు అరెస్టు చేసి విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కోడా విజయ్ మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాలని ఆపలేరని, విద్యార్థులకు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు, 18 సంవత్సరాలు నిండిన మహిళా విద్యార్థినిలకు స్కూటీలను అందించాలని, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.