గుడిసెల్లో నివసించే నిరుపేదలకే తొలి ప్రాధాన్యత – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

June 18, 2026 | తెలంగాణ

జుక్కల్ జూన్ 18 జనం న్యూస్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిర్మాణ పనుల పురోగతిపై అదనపు కలెక్టర్ నిమ్మ వి. గిరి మరియు సంబంధిత అధికారులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, లబ్ధిదారులు తమ ఇల్లు నిర్మాణ దశకు అనుగుణంగా డేటా సక్రమంగా అప్‌డేట్ అయ్యిందో లేదో అధికారుల ద్వారా పరిశీలించుకోవాలని సూచించారు. నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.అలాగే గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ గృహ పథకంలో తొలి ప్రాధాన్యత కల్పించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper