నూతనంగా వచ్చిన ఆర్డిఓ వెంకన్న కలిసి శాలువాతో సన్మానం చేసిన ఉద్యమ కారులు

June 19, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం నూతనంగా పదవి బాధ్యతలు తీసుకున్న పరకాల ఆర్డిఓ డి ఎస్ వెంకన్న ను మర్యాదపుర్వకంగా కలిసిన తెలంగాణ ఉద్యమకారుల జిల్లా అధ్యక్షుడు పొడిశెట్టి గణేష్, ఉద్యమకారుల రాష్ట్ర కార్యదర్శి గజ్జి శంకర్ ఆయన కు పుష్ప గుచ్చం అందచేసి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉద్యమ కారుల పోరం మాట్లాడుతూ ఉద్యమ కారుల సమస్యలు ఉద్యమ కారులకు ఇచ్చే 25 వేల పెన్షన్ గౌరవ వేతనం,250 గజాల ఇంటి స్థలం సమస్య లను ఆర్డిఓ వివరించారు.తమ సమస్యలు సానుకూలంగా స్పందించి అమలు చేస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు జిల్లా వైస్ ప్రెసిడెంట్ పల్లెబోయి సారయ్య, దర్శనం, రవీంద్ర చారి, తల్లి దివ్యాంగుల సేవాసమితి మండల అధ్యక్షుడు ఎర్ర తిరుపతి రెడ్డి వెంట ఉద్యమ కారులు, నాయకులు పాల్గొన్నారు…

🌐 Select Language:
📰 ePaper