ఉదయ్ అసోసియేషన్ సచివాలయ పోరాటం కీలక అధికారులతో సమావేశం

June 19, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 19 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : మిత్రులారా నిన్న రాష్ట్ర ఉదయ్ అసోసియేషన్ బృందం మరియు కాంగ్రెస్ మేనిఫెస్టో సాధన సమితి ముఖ్య నాయకుడు నాగభూషన్ సచివాలయంలో దివ్యాంగుల హక్కులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల సాధన కోసం శరవేగంగా కీలక అడుగులు వేసింది. మున్సిపల్ మరియు హెల్త్ సెక్రటరీలు గౌరవ ముఖ్యమంత్రి సి యం అత్యవసర సమావేశంలో ఉన్నందున వారి ఆదేశాల మేరకు మున్సిపల్ చీఫ్ సెక్రెటరీ ఓ యస్ డి ని మరియు హెల్త్ సెక్రటరీ ఓ యస్ డి ని మన ఉదయ్ టీం ప్రత్యేకంగా కలవడం జరిగింది. సమావేశంలో చర్చించిన ముఖ్యమైన అంశాలు:మున్సిపల్ శాఖ: మున్సిపల్ విభాగంలో రాబోయే పోస్టులతో పాటు, ప్రస్తుతం ఉన్న అన్ని మరియు ఉద్యోగాలలో దివ్యాంగుల రిజర్వేషన్ల అమలుపై పక్కాగా ఫాలో-అప్ చేయడం జరిగింది. వైద్యారోగ్య శాఖ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో భర్తీ చేసే మరియు ఉద్యోగాలన్నింటిలో 2016 ప్రకారం 4% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించాలని డిమాండ్ చేశాము మైనార్టీ సంక్షేమ శాఖ: నిన్న మైనార్టీ శాఖ మంత్రి ని కూడా మన ఉదయ్ టీం నేరుగా కలిసింది. మైనార్టీ ఫండ్స్ ద్వారా ముస్లిం దివ్యాంగులకు ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే మైనార్టీ శాఖలో 2016 చట్టాన్ని పూర్తిస్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని వినతిపత్రం అందజేశామ
ఉదయ్ అసోసియేషన్.

🌐 Select Language:
📰 ePaper