తరగతి గదులు లేక విద్యార్థుల అవస్థలు- ధనాసిరి ప్రభుత్వ పాఠశాల కాంగ్రెస్ ప్రభుత్వ విద్యా నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం..ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం*
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జూన్ 19-06-2026 ఈ రోజు ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి పరిశీలించడం జరిగింది.ప్రధానో పాధ్యాయు లు,ఉపాధ్యాయులు,వంట సిబ్బంది మరియు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.ధనసిరి ఉన్నత పాఠశాల భవనాన్ని మూడు సంవత్సరాల క్రితం తొలగించి “మన ఊరు – మన బడి” పథకం కింద రూ.1.45 కోట్లతో కొత్త భవనాన్ని మంజూరు చేశారు.కాంట్రాక్టర్ సుమారు రూ.90 లక్షల విలువైన పనులు పూర్తి చేసినప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణం నిలిచిపోయింది. దీంతో సుమారు 180 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల గదుల్లోనే ఉన్నత పాఠశాల నిర్వహించబడుతోంది. ఉదయం ప్రాథమిక పాఠశాల, మధ్యాహ్నం ఉన్నత పాఠశాల తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు తరగతి గదుల కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది అనడానికి ఈ దనసిరి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలనే నిదర్శనం.ప్రభుత్వం కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తు ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది ఒక పూట బడులతో విద్యార్థులు సక్రమంగా విద్యపై దృష్టి పెట్టి చడవలేక పోతున్నారు మరియు టీచర్లు సమయ పాలన సరిపోక అనుకున్న మేరకు విద్యార్థులకు విద్యాబోధన చేయలేక బాధపడ్తున్నారు.ప్రభుత్వం గొప్పలు చెప్పడం కాదు స్వయంగా విద్యా శాఖను ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకొని ఈ విదంగా పేరుకే ఉన్నత పాఠశాల తరగతి గదులు లేకుండా పేద మధ్యతరగతి విద్యార్థులు వారి చదువులను ఏకాగ్రతతో ఏ విదంగా కోనసాగిస్తారు తరగతి గదులు లేని పాఠశాలలను నిర్వహిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి,ఈ ముఖ్యమంత్రి కే దక్కింది,ఇప్పటికే తెలంగాణ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు (Government School Enrollment)విషయంలో దేశంలో అత్యంత వెనుకబడిన రాష్టాలలో కింది నుండి రెండవ స్థానంలో నిలిచింది.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన “మన ఊరు – మన బడి” కార్యక్రమం మరియు గురుకుల విద్యాసంస్థలు విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడ్డాయి. పేద, గ్రామీణ మరియు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో గురుకులాలు కీలక పాత్ర పోషించాయి. అలాంటి విజయవంతమైన కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేయడం బాధాకరం.అదే సమయంలో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విషయంలో కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న గురుకుల వ్యవస్థను బలోపేతం చేయకుండా కొత్త పేర్లతో వ్యవస్థలను తీసుకురావడం వెనుక ప్రభుత్వ అసలు ఉద్దేశం ఏమిటో ప్రజలకు వివరించాలి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో భారీ వ్యయాలు, భూసేకరణలు, నిర్మాణాల విషయంలో అవినీతి మరియు ఆర్థిక అక్రమాలపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో సమాధానం చెప్పాలి. అవసరమైతే స్వతంత్ర విచారణ జరిపించి నిజానిజాలను ప్రజల ముందుంచాలి.మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించగా వంట సిబ్బంది బిల్లులు ఆలస్యంగా వస్తున్నాయని, అందుతున్న మొత్తాలు సరిపోవడం లేదని తెలిపారు. ఈ సమస్యను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ధనసిరి ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి పెండింగ్ బిల్లులు విడుదల చేసి పనులను పూర్తి చేయాలి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన “మన ఊరు – మన బడి” పనులను పునఃప్రారంభించి పూర్తి చేయాలి. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడకూడదు. పాఠశాలలు బలోపేతం కావాలి, గురుకులాలు అభివృద్ధి చెందాలి, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసం పెరగాలి. ధనసిరి పాఠశాలలో తరగతి గదులు నిర్మించి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వారి తరఫున పోరాడుతాము.ఈ కార్యక్ర మంలో గ్రామ సర్పంచ్ లక్ష్మి మాణిక్,మాజీ సర్పంచ్ శంకర్ నాయకులు యస్.గోపాల్, యం.మల్లేశం,చెంగల్ జైపాల్, పవన్ రాథోడ్,మేఘనాథ్, ఉపాద్యాయులు ఉన్నారు