బీజేపీ బలోపేతంపై ఓబీసీ మోర్చా నేతలతో కంచి మహేందర్ కీలక సమావేశంహైదరాబాద్:
జనం న్యూస్ జూన్ 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి భారతీయ జనతా పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై బీజేపీ సీనియర్ నాయకులు కంచి మహేందర్ నివాసంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర, జిల్లా నాయకులతో కీలక సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, జిల్లా అధ్యక్షులు మంగేష్ మర్యాదపూర్వకంగా విచ్చేసి కంచి మహేందర్ ని కలిశారు.ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో కలిసి బీజేపీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో పార్టీ కార్యాచరణ, అలాగే రాష్ట్రంలోని పలు రాజకీయ, సామాజిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజలకు మరింత చేరువ కావడం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, యువత మరియు వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా నాయకులు వినోద్ గౌడ్, సతీష్ గౌడ్, ఫతేనగర్ డివిజన్ నాయకులు బాలేష్, సురేష్, ఉషారాణి, శివ, అశోక్, చంద్, అరవింద్, కమలాకర్, రమేష్, రఘు, తిల్లు, మణికంఠ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.నాయకుల పరస్పర సమన్వయం, కార్యకర్తల ఉత్సాహంతో సమావేశం విజయవంతంగా సాగగా, పార్టీ అభివృద్ధి కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు.